Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు సహకారం అందించి భాగస్వాములు కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం గాజు లరామారం డివిజన్ పరిధిలోని బాలాజీ లే అవుట్, వక్షిత ఎన్క్లేవ్లలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్య క్రమంలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్ర మంలో డీసీ రవీందర్‌కుమార్, జలమండలి జీఎం శ్రీధర్‌రెడ్డి, నాయకులు విజయరామిరెడ్డి, ఇంద్రసేన గుప్త, రషీద్‌బేగ్, కమాలాకర్ పాల్గొన్నారు.
రింగ్‌బస్తీలో..
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని మొక్కలు నాటా రు. అనంతరం పేరుకు పోయిన చెత్తా, చెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్‌నగర్‌లో..
చింతల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో గ్రంథాలయం వద్ద నిర్వహించిన పట్టణ ప్రగతి కార్య క్రమంలో స్థానిక కార్పొరేటర్ రశీదాబేగం పాల్గొని మొ క్కలు నాటారు. అనంతరం వాలిబాల్ కోర్టును ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్య క్షులు మహమ్మద్‌రఫీ, ఏఈ సంపత్, జలమండలి మేనేజర్ పూజిత, ఎస్ఎస్ దుర్గారావు పాల్గొన్నారు.