Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
పేదలకు అండగా ఉంటానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం తన నివాసంలో తల్లిదండ్రులను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోల్నాక డివిజన్ సుందర్ నగర్‌కు చెందిన మమత, నందిని, యమున అనే యువతులు గతంలో అనారోగ్యంతో తండ్రి, ఇటీవల అనారోగ్యంతో తల్లి మతిచెందడంతో అనాధ పిల్లలకి వాళ్ల పిన్ని దగ్గర నివాసముంటున్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు, బస్తీవాసులు అనాథ పిల్లల అయిన వారిపై చదువుల కోసం ఆర్థిక సాయం, ఇతరత్రా సాయం అందించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారిని మర్యాదపూర్వకంగా తన నివాసానికి పిలిపించుకొని వారి దుస్థితిని అడిగి తెలుసుకొని, సానుకూలంగా స్పందించి వారి చదువులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలని ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, తమకు తోచినంత ఆర్థిక సాయంగాని ఇతర సాయంగాని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు భరత్ రాజు, యూసఫ్, మహేష్ పాల్గొన్నారు.