Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు స్వచ్చమైన గాలిని అందించాలని గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం కాలనీలో ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కస్తూరి బాల్‌రాజు, నవాబు, శ్రీనివాస్, ఇబ్రహీం, మురళీ, వీరన్న తదితరులు పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సీసాలబస్తీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఈ సతీష్, ఎలక్ట్రికల్ ఏఈ వెంకట్‌రెడ్డి, జలమండలి మేనేజర్ అంకిత్, డివిజన్ అధ్యక్షులు మల్లేష్‌గౌడ్, నాయకులు సయ్యద్ రశీద్, కొలుకుల జైహింద్, రుద్ర అశోక్, సంతోష్, హాజీ, గణేష్, ఎర్ర యాకయ్య, ఆజాం, సాజిద్, గణేష్, గిరి, మనోజ్, సాజిద్, శాంతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.