Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో క్యాంటీన్, డీఈ కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-మలక్‌పేట్
సీఎం కేసీఆర్ తీసుకున్న విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం మలక్‌పేట్‌లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో చైర్పర్సన్ రాధా గిరిధర్ గుప్త ఆధ్వర్యంలో నిర్మించిన క్యాంటీన్(రూ.35 లక్షలతో), మార్కెట్ ముఖాద్వారం( రూ.5 లక్షలతో), డీఈ కార్యాలయాన్ని (రూ.40లక్షలతో) హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే బలాలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల పంటల సాగుకు తెలంగాణ నేల ఎంతో అనువైనదన్నారు. సీఎం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నో ప్రోత్సాహకాలను ప్రకటించి, అధునాతన విధానాలను అవలంభించి నూతన ఒరువడిని సృష్టించారన్నారు.
కోహెడలో ఆధునిక ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం
వ్యవసాయ రంగానికి మార్కెటింగ్ శాఖ ఎంతో కీలకం అని, శాస్త్రీయ విధానాలను అవలంభించి మరింత పటిష్టం చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కోహెడలో ఆధునిక ప్రమాణాలతో 170 ఎకరాల్లో మార్కెట్‌ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను కూడా తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌కు తగ్గట్లు పరిశోధన, విశ్లేషణ చేసేందుకు నూతన ఇంటలిజెన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మలక్‌పేట్ టీఆర్ఎస్ ఇన్చార్జి అజాం అలీ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు రవి కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి మిద్దె దామోదర్, వైస్ చైర్మెన్ బూమేశ్వర్, పాలక మండలి సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.