Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
పచ్చదనం, పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎంఓ కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని మునీరాబాద్ గ్రామంలో పర్యటించారు. వైకుంఠధామం సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రామ నర్సరీ, పల్లె ప్రకృతివనం, పార్క్లోనాటిన మొక్కలను దగ్గరుండి పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. పాఠశాల డ్రాపౌట్ విద్యార్థుల వివరాలను సర్పంచ్ చిట్టిమిల్ల గణేష్‌ను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీ, పిల్లల వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత గ్రామాలు పట్టణాల కంటే వేగంగా పచ్చదనం, పరిశుభ్రతతో దూసుకుపోతున్నాయని తెలిపారు. పాఠశాల ప్రాంగణాల్లో పూల, పండ్ల మొక్కలను విరివిగా పెంచాలని కోరారు.
85% మొక్కలు బతకాలి.. లేకుంటే పాలకవర్గాలు రద్దు
రోడ్లకు ఇరువైపుల పూల మొక్కలను పెంచి గ్రామాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సర్పంచ్‌కి ఆదేశాలిచ్చారు. గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కల్లో 85% బతికుండాలని లేకుంటే పాలకవర్గాలు రద్దవుతాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి, జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి స్మిత, జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి, బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు చిట్టిమిల్ల రాగజ్యోతి, మండల పంచాయతీ అధికారి వినూత్న, మిషన్ భగీరథ ఎస్ఈ ఆంజనేయులు, ఈఈ నర్సింహులు, ఈఈ జ్యోతి, డీఈ మహేందర్, ఏఈ శామ్యూల్, పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ నర్సింగ్ రావు, వార్డు సభ్యులు కుతాడి నరేందర్, శ్యామల రమేష్, కైరంకొండ పద్మావతి, ఏనుగు నాగరాజు రెడ్డి, మాదిరెడ్డి వెంకట శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు దేవేందర్, అంగన్వాడీ టీచర్ పద్మావతి, ఆశా వర్కర్ కృష్ణవేణి, బిల్ కలెక్టర్ విజరు తదితరులు పాల్గొన్నారు.