Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలానగర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-బాలానగర్
నాలాలపై నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని సీపీఐ(ఎం), కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం బాలానగర్‌లో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, వారి అనుచరులు ఒక ముఠాగా ఏర్పడి అక్రమ కట్టడాలని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారన్నారు. అనుమతులు లేని అనేక భవనాలను కడుతూ వారికి మద్దతుగా ఉన్న అధికార పార్టీ నాయకులకు, వారికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఐలాపురం రాజశేఖర్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా సత్యం శ్రీరంగం, జాయింట్ సెక్రటరీ బండారి నవీన్‌గౌడ్, మేడ్చల్ జిల్లా జాయింట్ సెక్రటరీ మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి, సీపీఐ నాయకులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పుష్ప రెడ్డి, బోయిన్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ రాజేందర్, సెక్రటరీ అస్లాం, బాలాజీనగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ రాజ్‌పుత్, ఆకుల మల్లికార్జున్, బాలానగర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆకుల నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసన్నకుమార్, గజానంద్ శేఖర్, మహేందర్, మధుసూదన్, శివ, ముకేందర్, వినోద్, వెంకట నర్సయ్య, జగన్, సతీష్ కుమార్, అజరు, శంకర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.