Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
నవతెలంగాణ-హయత్‌నగర్
షటర్తాళం పగులగొట్టి సెల్ఫోన్లు చోరీ చేసిన నిందితులను ఎల్బీనగర్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. సోమవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ ఖరగ్‌పూర్ కు చెందిన మహమ్మద్ ముస్లీం సీక్ అలియాస్ తసలెం, మహమ్మద్ జాసిముద్దీన్ అలియాస్ యూసుఫ్, రఫిక్ లు ప్రస్తుతం ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ పనుల కోసం బైరామల్ గూడలో నివాసం ఉంటున్నారు. మహమ్మద్ అకజామాన్ సహాయంతో మహమ్మద్ ముస్లిం రూ. 15వేలకు పనిలో చేరాడు. మిగతా ఇద్దరికి పని దొరకకపోవడంతో చెడు అలవాట్లకు బానిసై ఎల్బీనగర్లో ఈనెల 1న తాళం వేసి ఉన్న సెల్‌ఫోన్ దుకాణం షాప్‌లో ఉన్న ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు నిందితులను ఖరగ్‌పూర్ వద్ద రైల్వే స్టేషన్లో అక్కడి పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. ట్రాన్సుడ్ వారెంట్‌పై అక్కడి కోర్ట్‌లో హాజరు పర్చి తీసుకుని వచ్చి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లతో పాటుగా 26 ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. సమావేశంలో క్రైమ్ డీసీపీ యాదగిరి, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, డీఐ ఉపేందర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.