Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎల్పీజీ సిలిండర్ ధర రెట్టింపు
- ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి ఆరోపణ
నవతెలంగాణ-నారాయణగూడ
ఇల్లు సంసారం లేని మోడీకి ఇంటి ఖర్చులు ఎలా తెలుస్తాయని, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలు రెట్టింపు అయ్యాయని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి ఆరోపించారు. అధికంగా పెంచిన ఎల్పిజి సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం ట్యాంక్ బండ్ పై నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా సమాఖ్య మహిళా నాయకులు, కార్యకర్తలు పెంచిన ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎల్పీజీ సిలిండర్లను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ.. ఎల్పిజి సిలిండర్ల ధర రూ.1,000 మార్క్‌ను తాకబో తుందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇలా ధరలు అధికంగా పెంచుకుంటూ పోతూ సబ్సిడీ ఇవ్వకుండా సామాన్య ప్రజలు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు.పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వలన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర నిరుద్యోగం, ఆర్థిక నిస్సహాయత, అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొం టున్నారని, తొంభైై శాతం కుటుంబాల ఆదాయం ఫుర్తిగా పడిపోయిందని, పూట గడవడం కష్టంగా మారిందని వాపోయారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరవధికంగా పెంచుకుంటూపోతూ ప్రజలను లూటీ చేస్తూ, మహిళా బడ్జెట్‌ను దెబ్బతీస్తుందని మండి పడ్డారు. బీజేపీకి చెందిన ''అచ్చేదిన్'' (మంచి రోజులు) ఇప్పుడు ''మహేంగే దిన్'' (ఖరీదైన రోజులు) అని ఇప్పుడు రుజువు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ 'ఖరీదైన రోజుల' నుండి దేశ ప్రజలను విముక్తి కోరుతున్నా మన్నారు.పెంచిన ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రధాని మోదీ వెంటనే దించాలని, లేకపోతే ప్రజలు ఆయన్ను దించుతారని, పెంచిన ఎల్పీజీ సిలిండర్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని, లేనిపక్షంలో సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్య మాలు చేపడతామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.కష్ణకుమారి, జె.లక్ష్మి, సహాయ కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, కార్యవర్గ సభ్యురాలు కె.జంగమ్మ, మహిళ నాయకులు కమలమ్మ, గిరిజ, హైమవతి, గోవిందమ్మ, ఉమ, జ్యోతి, స్వరూప, ఇందిర, కిష్టమ్మ పాల్గొన్నారు.: