Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను వెన్వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. బౌద్దనగర్ నాలా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇప్పటికే రూ.4కోట్ల మేరకు నిధులను వినియోగించమని, నిధుల కొరత ఎదురుకాకుండా ఏర్పాట్లు జరిపి ఇతరత్రా సమస్యలను కుడా పరిష్కరిస్తామని అయన తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులతో కలిసి అయన సోమవారం బౌద్దనగర్ డివిజన్లో పర్యటించారు. కౌసర్ మస్జీద్, ఎల్ నారాయణనగర్, వారాసిగూడ, అంబర్ నగర్, అల్లాడి రాజ్ కుమార్ నగర్ తదితర ప్రాంతాల్లో నాలాను పరిశీలించారు. వివిధ ప్రదేశాల్లో ఇటీవల నాలా పునర్నిర్మించినందువల్ల ఎదురవతున్న సమస్యలను పరిశీలించారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ కంది శైలజ, డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, ఈఈ ఆశలత, టీఆర్ఎస్ యువ నేత రామేశ్వర్గౌడ్, నాయకులు, అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ వివిధ ప్రదేశాల్లో మాట్లాడుతూ 50 సంవత్సరాల కాలంలో చేపట్టని ఎన్నో పనులను బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో కేవలం 7 సంవత్సరాల్లో చేపట్టాము. ముందుగా బౌద్ధనగర్ వాసుల దాహార్తిని తీర్చేందుకు కష్ణా జలాలను మళ్ళించి, నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. రూ.32లక్షల ఖర్చుతో చేపట్టిన ఈ పనుల వల్ల బౌధనగర్ ప్రజల దాహార్తి తీరిపోయింది. పైగా అంబర్ నగర్ ప్రాంతానికి రోజు నీటిని అందించే పధకాన్ని ప్రవేశ పెట్టాము. రూ. 3.75 కోట్ల ఖర్చుతో వారాసిగూడ నుంచి అంబర్ నగర్ వరకు నాలాపై స్లాబ్ నిర్మించే పనులను దశల వారీగా చేపట్టారు. ఇప్పటికీ కౌసర్ మసీదు, బౌధనగర్ రోడ్ నెంబరు 5 ప్రాంతాల్లో ఈ పనులను విజయవంతంగా పూర్తీ చేశామన్నారు.