Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను, ప్రభుత్వమే బీదలకు పట్టా ఇచ్చినప్పటి నుండి సంవత్సరాల తరబడి కన్నెత్తి అయినా కానరాని వారు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములలో 4సంవత్సరముల క్రితం కొనుగోలు చేసి నివాసముంటున్న వారిపై ఈ ప్లాట్లు అన్నీ తమవేనంటూ తమపై దౌర్జన్యంగా సదరు చింతకింది సుధాకర్ అజమాయిషీ చేలాయిస్తున్నారంటు బాధిత కుటుంబాలు సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లక్ష్మీనగర్ బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ 576 లక్ష్మినగర్‌లో సుమారు 18 సంవత్సరాల క్రితం అప్పటి రైతుల వద్ద నుండి భూమిని స్వాధీనం చేసుకొని నిరుపేదలకు ప్రభుత్వమే పట్టాలు అందించే కార్యక్రమం చేపట్టగా, అట్టి లేఅవుట్లో పట్టాదారులు కొంతమంది తమ భూములు విక్రయించి వెళ్లిపోగా కొందరు నిరుపేదలు ఇంటి కల సాకారం చేసుకునేందుకు అప్పులు చేసుకొని వారి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసి గత నాలుగు సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఒక్కసారిగా గత సంవత్సరం బౌరంపేట్ వాస్తవ్యులు చింతకింది సుధాకర్, చింతకింది పెద్ద జితయ్య, చింతకింది రమేష్‌లు గతంలో ఈ భూములన్నీ మావే అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారని, ఇప్పుడు మీరు ఉంటున్న ఈ ప్లాట్లు, ఇక్కడి ఖాళీ స్థలాలు అన్నీ తమవేే అని అంటూ సదరు వ్యక్తులు గత కొన్ని నెలలుగా నిత్యం తమను వేధిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, కొనుగోలు చేసినా సరే ఇక్కడి ఇండ్లలో నివసించరాదని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. కొందరు మహిళలను ఇండ్లపై పంపించి మహిళలతో తిట్ల దండకం సైతం చేయిస్తూ వేధిస్తున్నారని, అంతటితో ఆగకుండా తమ ఇంటి ముందు 20 ఫీట్ల రోడ్డు గల మొరం రోడ్డుని సైతం అక్రమ బోరు నీటి కనెక్షన్ ద్వారా బురదగుంటల మయంగా మారుస్తూ ఓవైపు దుక్కి దున్నుతూ చుట్టూ ఇంటి పరిసరాలన్నీ కావాలని కక్షతో తమ గహాల పునాదులకు బోరు నీటితో ఇళ్లను తమ ఇండ్లను ముంపునకు గురిచేస్తూ కుటుంబాలు భార్య, పిల్లలతో ఇంట్లో ఉండకుండ చేయిస్తున్నారని బాధితులు మంగళవారం విలేకర్ల సమావేశంలో చింతకింది సుధాకర్ చేస్తున్న ఆగడాలను ప్రత్యక్షంగా తెలియపరిచారు. ఈయన దౌర్జన్యాలపై గత కాలంగా ప్రజాప్రతినిధులకు, కలెక్టర్ కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో తెలియపరచగా తహసీల్దార్ వచ్చి ఇది ప్రభుత్వ భూమి అంటూ అక్కడి ఖాళీ స్థలంలో ప్రభుత్వ భూమి బోర్డులు సైతం ఏర్పాటు చేశారని, చుట్టుపక్కల నివాసాల వారికి ఇబ్బంది చేయకూడదని తెలిపినా కూడా సుధాకర్ మాత్రం నిత్యం ఆగడాలను ఆపకుండా తమ కుటుంబాలను ఇబ్బందులు చేస్తున్నారని, అంగవైకల్యం గలవారి కుటుంబాలను సైతం చూడకుండా కక్షతో అధికారులకు తప్పుడు ఆరోపణలు తెలియజేస్తూ పరోక్షంగా ఇండ్లను కూల్చివేతలు చేసే విధంగా పాల్పడుతున్నారని బాధిత కుటుంబాలు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్కె. ఖాదర్‌లు రోదిస్తూ తమ ఇల్లును కుట్రలకు తెరలేపి అధికారులతో కూల్చి వేయించాడని, మూడు సంవత్సరాలుగా అంగవైకల్యంతో ఉన్న నేను డ్రైవర్ వత్తిని కొనసాగిస్తూ, లాక్డౌన్ నేపథ్యంలో తిండి లేక ఇబ్బంది పడుతున్నానని కన్నీటి పర్యంత మయ్యాడు. నాలాగా ఎందరో నిరుపేదలు సొంతగూడు కోసం అప్పులు చేసి కొనుగోలు చేశామని, ఇండ్ల నిర్మాణాలు చేస్తుంటే ఆయన ఇక్కడ కనిపించకుండా ఉన్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలకు వచ్చి మా భూమి అంటూ ఇలా కుటుంబా లను కుటుంబాలను భయభ్రాంతులకు చేయడం ఎంతవరకు సబబు అని తెలిపారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు, సుధాకర్ దౌర్జన్యాలు ఆపివేసి చర్యలు చేపట్టాలని బాధితులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు అనిల్ అచ్చు నాయక్, శివరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ కుమారి, సునీత, మహేష్,నరేష్ , శేఖర్ రెడ్డి తదితర ఫ్లాట్స్ యజమానులు, కుటుంబీకులు పాల్గొన్నారు.