Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసహనంతో కార్య క్రమంలో పాల్గొనని కార్పొరేటర్
నవతెలంగాణ-గాంధీనగర్
అధికారుల నిర్లక్ష్యం, జీహెచ్ఎమ్సీ వివిధ విభాగాల సిబ్బంది సమన్వయ లోపంతో పట్టణ ప్రగతి కార్యక్ర మం అనుకొన్న లక్ష్యాలు మాత్రం నెరవేరేలా లేవు. దీంతో ప్రజలకు నగరంలో మళ్ళీ ముంపు సమస్యలు తప్పేలా లేవు. ఫోటోలకు ఫోజులు కాదు ప్రజల సమస్యలు ముఖ్యం, వాటిని తీరుస్తానని నన్ను ప్రజలు గెలిపించారు కానీ అధికారులు, సిబ్బంది, బడ్జెట్ లేకుండా ఎలా పనులు చేపట్టాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినరుకుమార్ అసహ నం, ఆవేదనతో మీడియాతో మాట్లాడారు. తమకు రెండు వాహనాలు ఇస్తామన్నారు కానీ 7 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. వర్షా కాలంలో డివిజన్ పరిధిలోని పేదల ఇబ్బందులు తీర్చాలని బాపునగర్, సబర్మతి నగర్, అరుంధతి నగర్లో రిటర్నింగ్వాల్ బస్తీవారీ ప్రయోజనం దష్ట్యా శాశ్వతంగా ప్రాతిపదికన పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేపట్టక పోతే పేదలైన బస్తీవారి కోసం తగిన చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారం భం రోజున మూడు మొక్కలు నాటడం జరిగింది. ఎన్ని మొక్కలు వచ్చాయి? దీనికి బడ్జెట్ ఎంత? అనే విధి విధానాలు ఇంత వరకు ప్రజాప్రతినిధులకు అందలేదని అన్నారు. మరో రెండు రోజుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తి అవుతున్నా ఇది ఫోటోలకే పరిమితమైందని తాము పాల్గొనడం లేదని చెప్పారు.