Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మెన్ బాలకృష్ణ
- మూడో డే కేర్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎక్కువ మంది పేద ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఇండో అమెరి కన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మెన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లో మూడో డే కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి వార్డును ఆస్పత్రి సీఈఓ, వైద్య బృందంతో కలిసి బాలకృష్ణ పరిశీలిం చారు. వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఇది వరకే ఉన్న డే కేర్ యూ నిట్ ఒకటి, రెండులలో ఉన్న 31 పడకలకుగాను మరో 11 పడకలు డే కేర్ యూనిట్ మూడులో అం దుబాటులోనికి వచ్చాయి. ఈ మూడు యూనిట్లతో పాటు ఇతర వార్డుల్లో అందుబాటులో ఉన్న పడకల న్నింటితో కలుపుకుని డే కేర్ చికిత్సకు మొత్తంగా 160 పడకలు రోగులకు అందుబాటులోనికి వచ్చా యి. ముఖ్యంగా కీమో థెరపీ చికిత్స తీసుకునే రోగుల కు ఈ పడకలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటా యి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నానా టికీ పెరుగుతున్న రోగులకు ఆలస్యం కాకుండా క్యాన్స ర్ చికిత్స అందించడానికి వీలుగా సౌకర్యాలు కల్పిస్తు న్నామని తెలిపారు. అటు ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స తీసుకునే వారికి ఇప్పటికే పడకల సంఖ్యను పెంచా మనీ, అలానే ఇతరత్రా కేటగిరీల కింద చికిత్స కొచ్చే వారికి కూడా సదుపాయాలు పెంచే ప్రక్రియ కింద నేడు ఈ నూతన డే కేర్ వార్డును అందుబాటులోనికి తీసుకొచ్చామని తలిపారు. అనంతరం వార్డులోని సదుపాయాలను పరిశీలించిన బాలకృష్ణ హాస్పిటల్ ఆవరణలో ఉన్న పలు పేషెంట్లను పరామర్శిస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని సిబ్బందికి తగి న సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఆర్.వి.ప్రభాకరరావు, మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ ఫణికోటేశ్వరరావు డాక్టర్ కల్పనా రఘునాథ్, అసోసియేట్ డైరెక్టర్ (అకడమిక్స్ యాడ్ లైఫ్), డాక్టర్ సెంథిల్ రాజప్ప, హెడ్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ అంకాలజీ విభాగానికి చెందిన వైద్యులు డాక్టర్ కృష్ణ మోహన్, డాక్టర్ పవన్ కుమార్, మెడికల్ విభాగాధిపతులు, వైద్యులు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.