Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్టాప్ వద్ద అన్నపూర్ణ సేవా ట్రస్ట్ కార్యా లయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికె పూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, కార్పొ రేటర్ నార్నె శ్రీనివాసరావు ముఖ్య అతిధులుగా హాజరై ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని దానాలోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన ట్రస్ట్ సభ్యులను అభినందించారు. అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వ్యవ స్థాపకులు తమిరి రాజు 50 రోజులుగా నిమ్స్ హాస్పిట ల్లో కొవిడ్ పేషెంట్స్‌కు ఉచితంగా అన్నదానం చేశారని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ సభ్యులందరినీ సన్మానించారు. ఈ కార్య క్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్, సీనియర్ నాయకులు సమ్మారెడ్డి, చిన్నోళ్ల శ్రీనివాస్, జనార్దన్, యాదగిరి, అగ్రవాసు, వెంకట్ నాయక్, రాజు పటేల్, రఘు, తమిరి శ్రీనివాస్, ప్రసాద్, ఎండీ అహ్మద్‌ఖాన్, ఆర్కె చౌదరి, రాకేష్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.