Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవటెలంగాణ-బడంగ్పేట్
మతిస్థిమితం కోల్పోయిన యువకుడిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన మాతదేవోభవ ఆశ్రమం.గట్టు గిరి.గత మూడు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి హయత్నగర్ పరిసరప్రాంతంలో తిరుగు తున్న యువకుడిని స్థానికులు గమనించి ఆశ్రమనికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని అతని పరిస్థితిని గమనించి మాతదేవోభవ అనాధ ఆశ్రమం చేరదీసి ఆశ్రమంలో చేర్పించడం జరిగిందని ఆశ్రమ చైర్మన్ గట్టు గిరి తెలిపారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అతనికి అన్నిరకముల వైద్య చికిత్సలను అందించిన తరువాత అతడు తన వివరాలను తెలియచేయడం జరిగిందన్నారు. తన పేరు ఖాతల్ అని, వయస్సు26 ఏండ్లు, స్వస్థలం గ్రామం, మండలం ధన్వాడ జిల్లా నారాయణపేట్ అని చెప్పడం జరిగిందని తెలిపారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించ డంతో వారి కుటుంబసభ్యులకు సమాచారం అందిం చడం జరిగిందని, ఆ యువకుడిని అక్క మహినబి, బంధువులు ఆశ్రమానికి వచ్చి ఖాతల్ని తమవెంట తీసుకువెళ్ళారని పేర్కొన్నారు. తమ తమ్ముడు తమ నుండి దూరమై ఆరు సంవత్సరాలు అయిందని చనిపోయడని అనుకున్న తమ్మున్ని మళ్ళి అతనిని చూస్తమనుకోలేదని, చాల చోట్ల వెతకడం జరిగిందని కానీ ఫలితంలేదని, తమ తమ్ముడి తమ చెంతకు చేర్చిన ఆశ్రమ నిర్వాహకులకు కతజ్ఞతలు తెలిపారని అయన పేర్కొన్నారు. మానవసేవయే-మాధవసేవ నమ్మకంతో ఎంతో మంది అనాథలను చేరదీసి వారికి మానవతావాది హదయంతో ఆశ్రమంలో సేవ చేస్తున్నామని తెలిపారు.