Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి విజయవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెేపీ వివేకానంద్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టిన హరితహరం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీ వెన్ ఎన్‌క్లేవ్‌లో, జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని షిర్డిహీల్స్లో, రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని చెన్నరెడ్డినగర్, గుడెన్మెట్, చింతల్ డివిజన్ పరిధిలోని వల్లబారుపటేల్నగర్, సూరారం డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసీ కాలనీలో, సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని అపురూపకాలనీలో, కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాపునగర్‌లో, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెన్నెల గడ్డ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, బి.విజరుశేఖర్గౌడ్, రశీదాబేగం, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి, కె.ఎం.గౌెరీష్లతో కలిసి ఆయా ప్రాంతాలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షిర్డిహిల్స్లో పోచమ్మ తల్లి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. టీఎస్ఐఐసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న థీమ్ స్పోర్ట్స్ పార్కు అభివృద్ధి పనులను, వెన్నెలగడ్డ చెరువును పరిశీలించారు. అదే విధంగా గుడెన్మెట్లో ఆర్ఎఫ్టీ యంత్రం ద్వారాచెత్త చెదారాన్ని, వ్యర్థాలను రీ సైకిల్లింగ్ చేసే విధానాన్ని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డీసీలు మంగతాయారు, రవీందర్‌కుమార్, జలమండలి జీఎం శ్రీధర్‌రెడ్డి, నోడల్ అధికారులు శ్రీనివాస్, పాపమ్మ, శీరిష, రాజు, భానుచందర్, డిజిఎం రాజేష్, ఎఈలు సురేందర్‌నాయక్, ఇంద్రసేన్, ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.