Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాథలైన భార్య, ఇద్దరు చిన్నారులు
- ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
'అల్లారుముద్దుగా పెంచుకున్న చెట్టంత కొడుకు మాకు పట్టెడన్నం పెట్టి మంచిగ చూసుకుంటడని అనుకున్నం. కానీ అర్ధాంతరంగా మహమ్మారి కరోనా బలితీసుకుంటుందని అనుకోలేదు' అని కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పంచశీలకాలనీకి చెందిన సామాజిక సేవకుడు జింకల వెంకటేష్, వసంత దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కరోనా కాటుకు యువకుడు బలికావడంతో అతని భార్య, ఇద్దరు చిన్నారులు అనాథలు మారిన హృదయవిధాకరమైన సంఘటన స్థానికులందరికీ కలిచివేసింది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వెంకటేష్, వసంతల ఏకైక కుమారుడు యువ కిశోరం జింకల రవితేజ(32)కు 55 రోజుల క్రితం స్వల్ప జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో మలక్‌పేట, బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. కొడుకును బతికించడంకోసం అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి సుమారు రూ.23 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపొవడంతో కరోనాతో 55 రోజులు పోరాడి గత నెల జూన్ 29న కన్నుమూశాడు. ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అసరాగా నిలిచిన భర్త మరణంతో భార్య సంధ్య ఇద్దరి ఆడపిల్లలు సృతిక, అక్షర చిన్నారులతో దిక్కు తోచని స్ధితిలో రోదిస్తున్నారు. మృతుని తాత, నాయనమ్మ మనువడి మరణంతో మూగబోయారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని బంధు మిత్రులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు కోరుకుంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని బాథితులు విజ్ఞప్తి చేశారు.