Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- పలు పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-తుర్కయాంజల్
రైతులకు కరెంట్ ఇబ్బందులు కలుగకుండా చూస్తా నని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నా రు. తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ తుర్కయంజాల్ మున్సిపాలిటీ రాగన్నగూడలో రూ. 1.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ డివిజన్ ఇంజినీర్, రెవెన్యూ కార్యాలయం పనులకు బుధవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి, ఎస్ఈ, ఏడీడీఈ అధికారులతో కలసి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ గతంలో నియోజకవర్గంలో 7 సబ్ స్టేషన్ ఉండే వనీ, ప్రస్తుతం 23కు పెంచామన్నారు. గతంలో రైతులు నానా ఇబ్బందులు పడ్డారనీ, లో వోల్టేజీ సమస్య వల్ల మోటర్లు కాలిపోయేవని గుర్తు చేశారు. అంచెల వారీగా సబ్ స్టేషన్లు పెంచడం వల్ల ఇప్పుడు రైతులు చాలా సంతో షంగా ఉన్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో పంటలు బాగా పండుతాయన్నారు. 6 నెలల కాలంలో భవనాన్ని నిర్మించాలని అధికారులకు సూచించారు. త్వరలో మంత్రి కేటీఆర్‌తో మున్సిపల్ కార్యా లయ భవనం, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. మున్సిపాల్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మున్సిపాల్టీలో లోవోల్టేజీ సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీసీ వైస్ చెర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు సమితి అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మెన్ కండాడి ముత్యంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుండ్ల పల్లి హరితదరాజ్ గౌడ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయ క్, కౌన్సిలర్లు పుల్లగుర్రం కీన విజయానంద్ రెడ్డి, వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, తాళ్ళపల్లి సంగీత మోహన్ గుప్త, మేతరి అనురాధ దర్శన్, కుంట ఉదయశ్రీగోపాల్ రెడ్డి, నారణి కవిత శేఖర్ గౌడ్, నక్క శివలింగం గౌడ్, మర్రి మాధవి మహేందర్ రెడ్డి, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కంగాడి లక్ష్మారెడ్డి, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీ ఉల్లా, తుర్కయంజాల్, ఈ తాజుద్దీన్ తది తరులు పాల్గొన్నారు.