Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలంగాణ టెంపోరరీ లైట్ సౌండ్ అండ్ జనరేటర్ సప్లయర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షులుగా శ్రీరామ్ యాదవ్, జనరల్ సెక్రెటరీ గా ఏజి. నిర్మల్ లాల్, కోశాధికారిగా జి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా టి.అంజయ్య, కిషోర్ యాదవ్, వి.రాజు, మహమ్మద్ మొయిన్ ఉద్దీన్, మహమ్మద్ సాబెర్, లీగల్ అడ్వైసర్‌గా లోకేందర్ శర్మ, సెక్రటరీలుగా కే.రవీందర్, టి.నరేష్ సింగ్, టి.వినరు కుమార్, పి.వివేక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం బేగంబజార్‌లోని సనాతన ధర్మశాల్లో కొత్త కార్యవర్గ ఎన్నిక, సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ రామ్ యాదవ్ మాట్లాడుతూ గతేడాది నుంచి కరోనా, లాక్డౌన్ కారణంగా జంటనగరాల్లో ఉన్న దాదాపు 3000 మంది దుకాణదారులు తీవ్ర ఆర్ధిక ఇబందులు పడుతూ అప్పుట్లో కూరుకుపోయారనీ, దీంతో చానా మంది లైట్, సౌండ్, జనరేటర్ దుకాణదారులు తమ సామానులను స్క్రాప్‌గా అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అని వర్గాల ప్రజలను పట్టించుకున్నా తమను మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. 30 ఏండ్లుగా రేట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం ధరలు పెరిగినా తమ రేట్లను పెంచలేమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణదారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుకాణదారులు, తదితరులు పాల్గొన్నారు.