Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ అంకితభావంతో పనిచేసి వన్నె తేవాలని టీయుడబ్లుజే (ఐజేయు) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు మోతె వెంకట్‌రెడ్డి, గడ్డమీది బాలరాజు పేర్కొన్నారు. మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ తొలి కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు సంకూరి మురళి అధ్యక్షతన బుధవారం పీర్జా దిగూడలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణ లో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడంలో జిల్లా కమిటీ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. జర్నలి స్టులకు అవసరమైన హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, ఇండ్ల స్థలాల విషయంలోనూ సహకారమందిస్తామని హామీని చ్చారు. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే, మంత్రులపై ఒత్తిడి తెచ్చి న్యాయబద్ధమైన హక్కులు సాధించుకుందామ న్నారు. మేడిపల్లి ప్రెసబ్ అధ్యక్షుడు మురళి, కార్యనిర్వా హక అధ్యక్షుడు వెల్లంకి జయపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కల్కూరి ఎల్లయ్య మాట్లాడుతూ స్థానిక జర్నలిస్టులు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా కార్యవ ర్గాల సహకారం, సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రెస్ క్లబ్ 'అధ్యక్షుడు మరాఠీ రవి, స్థానిక ప్రెస్ క్లబ్ ప్రతినిధులు డి.నర్సయ్యగౌడ్, రేగు శ్రీనివాస్, లెల్లపాటి నర్సింహారెడ్డి, పర్రెపాటి శ్రీనివాస్, చిర్ర శ్రీధర్‌రెడ్డి, వంగ శ్రీనివాస్‌రెడ్డి, ననబోతు రాముయాదవ్, గుండ్ల కుమారస్వామి, శిలు వేరు వేణు, దూడల విష్ణుగౌడ్, ఎ.వెంకటేశ్వర్లు, కె.నాగ భూషణ చారి, వి.సుందర్, జర్నలిస్టులు సీహెచ్ సుదర్శ న్, ఎస్.సాగర్‌రెడ్డి, వి.సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.