Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కూకట్పల్లి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భ్రుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీపార్క్వద్ద పట్టణప్రగతిలో కార్యక్రమంలో భాగంగా, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, తోటివారు కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలనానరు. పర్యావరణాన్ని కాపాడుకొని ప్రజలందరూ బాగుండాలనేదే పట్టణ ప్రగతి ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో కూకట్ పల్లి సర్కిల్ ఉప కమిషనర్ ప్రశాంతి, ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్, వాటర్ వర్క్స్ డీజీఎం వెంకటేశ్వరరావు, వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక ఏఈ శివప్రకాష్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మేనేజర్ అనిల్ కుమార్, ఎస్ ఆర్ పి నాయక్, కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఆస్బెస్టాస్ కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పాపిరెడ్డి నగర్ అధ్యక్షుడు చంద్రారెడ్డి , శ్రీధర్ రెడ్డి, అబ్బులు సత్యనారాయణ, షరీఫ్, కష్ణ, సువర్ణ, లావణ్య, భూలక్ష్మి, పద్మ, శోభ, దేవేందర్ రెడ్డి, మున్నా, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.