Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా డివిజన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ స్వర్ణ రాజు కాప్రా జెడ్పీహెచ్ఎస్ లో జీహెచ్ఎంసీ అధికారులు డి.ఇ. బాలకిషన్. ఎ.ఇ.అభిషేక్ డివిజన్ అధ్యక్షులు సుడుగు మహేందర్‌రెడ్డి, ఉప్పల్ మైనారిటీ ఇన్చార్జి బద్రుద్దీన్ డివిజన్ నాయకులతో కలిసి హరితహారం మొక్కలను నాటారు. పిల్లలకు బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం కాప్రా ఈద్గా దగ్గరోలని స్థలం చదును చేశారు. కాప్రా డివిజన్లో ఇప్పటివరకు వార్డ్ కార్యాలయం లేదని రెండు సంవత్సరాలుగా తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకోగా చివరకు తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఈ స్థలాన్ని 510లో కట్టుకోవచ్చునని చెప్పారు. డివిజన్ వార్డ్ కార్యాలయం, ఏరియా ప్రైమరీ హాస్పిటల్, మహిళ భవన్ల కోసం స్థలాన్ని సేకరించారు. దీనికి అవసరమైన విధులను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది అని జోనల్ కమిషనర్ చెప్పారు. అనంతరం రాజ రాజేశ్వరి కాలనీ, లేక్ వ్యూ కాలనీలో హరితహారంలో భాగంగా చెట్లు నాటారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్ కుమార్, కాప్రా డివిజన్ నాయకులు జనరల్ సెక్రటరీ గిల్బర్ట్, వార్డు మెంబర్లు కొప్పుల కుమార్, పవన్ కుమార్, శ్రీకాంత్, రవీందర్రావు, సుంకం యాదగిరి, బంక వెంకటేశ్, ఎన్.మహేష్, రవీందర్ రెడ్డి, గౌస్, మచ్చ పాండు. వై చంద్రా రెడ్డి, కొండల్ గౌడ్, గణేశ్. పి.మల్లారెడ్డి. సోమనాథ్, గుడ్డి నరసింగరావు, శివలింగం, అరవింద్. బబులు మహిళ అధ్యక్షురాలు సుజాత గౌడ్, సురేఖ, భానుమతి, నాగదేవి, సరిత పాల్గొన్నారు.