Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవటెలంగాణ-బడంగ్పేట్
పరిసరాల పరిశుభ్రతకే పటణ ప్రగతి, మొక్కలు నాటి కాలుష్య నివారణకు సహకరించాలని కలెక్టర్ అమోరు కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపటిన పట్టణ ప్రగతి కార్యక్ర మంను ప్రజలు విజయవంతం చేయాలని, కాలుష్య నివారణకు మొక్కలు ఎంతో ఉపయోగ పడుతా యని, ప్రజలంతా హరితహారంలో భాగస్వాములు కావాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, ఆడిషనల్ కాలెక్టర్ ప్రతిక్ జైన్, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డిలు అన్నారు. గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా గుర్రంగూడలో 6,7వ డివిజన్లలో జరుగుతున్న హరితహార కార్యక్రమాన్ని కాలెక్టర్ అమోరు కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్లు అకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డితో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గత ఏడు రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి, హరితహారం గురించి అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కార్పొ రేటర్లు, నాయకులతో కలిసి బడంగ్ పేట్‌లోని దావూథ్ ఖాన్‌గూడలో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. నర్సరీలో అధికారులు నాటిన మొక్కల పెంపకం, పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పలు కాలనీ అధ్యక్షులతో సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణీి చేయాలని సిబ్బందికి సూచించారు. వార్డు కమిటీలను పటిష్టం చేయాలని ఆమె సూచించారు. ప్రజలంతా కార్యక్ర మంలో భాగస్వాములైనపుడు సమస్యలను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. కాలనీ వాసులు ప్రత్యేక చొరవ తీసుకొని మొక్కలు నాటాలని మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేతర్లు డి.శంకర్,గడ్డం లక్ష్మారెడ్డి, ఆర్ఓ.చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఈలు బిక్కు నాయక్, రాంప్రసాద్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శానిటేషన్ సిబ్బంది, నగర దీపికలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.