Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాను ముందు ఆవేదన వ్యక్తం చేసిన బిల్డర్ రంగన్నగారి రఘుశర్మ
నవతెలంగాణ-కంటోన్మెంట్
ముగ్గురు వ్వక్తులు తనను కిడ్నాప్ చేసారని ఫిిర్యాదు చేసినా తిరుమలగిరి పోలీసులు పట్టించుకోవడం లేదని, తిరుమలగిరికి చెందిన బాధితుడు బిల్డర్ రంగన్నగారి రఘుశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు తిరుమలగిరిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మీడియా ముందు తన బాధను వెలిబుచ్చారు. బిల్డర్‌గా ఉన్న తనను సోమవారం సాయంత్రం అనిల్ అనే వ్వక్తి మరో ఇద్దరితో కలసి, తిరుమలగిరిలో గల అతని కార్యాలయం వద్దకు వచ్చి మాట్లాడే పని ఉందని చెప్పి, సాయంత్రం 6గంటలకు ఫోన్ చేసి రోడ్ వద్దకు పిలిపించుకున్నారని, అక్కడికి పోగానే బలవంతంగా ఇన్నోవా వాహనంలో తనను ఎక్కించుకునిపోయి కిడ్నాప్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తాను ను తెలుసుకునేలోపే తన సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి, బెదిరిస్తూ, తిడుతూ, కొడుతూ తిరుమలగిరి నుండి ఘటకేసర్ వరకు తీసుకెళ్లి అక్కడ కిడ్నాపర్ల కారులోనే మద్యం సేవిస్తూ... దుర్బాషలాడుతూ బెదిరించారని ఆయన చెప్పారు. భయంతో ఆత్మరక్షణ కోసం తప్పించుకునే ప్రయత్నంలో గట్టిగా కేకటు పెట్టడంతో అక్కడే వదిలేసి పారిపోయారన్నారు. వెంటనే అక్కడి నుండి ఆటోలో తిరుమలగిరి వచ్చి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశానన్నారు. ఫిిర్యాదు చేసి మూడు రోజులు గడిచినా పోలీసులు ఆ నిందితులపై కేసు నమోదు చేయలేదని, పైగా తనను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు అని చెప్పారు. నిందుతులపై ఎలాంటి చర్య తీసుకోకపోగా కనీసం.. తన ఫిర్యాదు రిజిస్టరు చేయమనడంతో బాధితుడు తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. వారి మధ్య ఉన్న వివాదం వల్ల కిడ్నాప్ చేశారని అన్నారు ఫ్రెండ్లీగా ఉండాల్సిన తిరుమలగిరి పోలీసులు తమ బాధ్యతలు మరచిపోతున్నారని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించి, వారి సమస్యల పరిష్కారం దిశగా సాగాల్సిన తిరుమలగిరి పోలీసుల వల్ల గాడి తప్పు తోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు తనకు న్యాయంం జరిగేలా చూడాలని, నిర్లక్ష్యం చేస్తున్న తిరుమలగిరి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.