Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ 23 వ వార్డులోని పేదలకు వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని వర్డ్ అండ్ డీడ్ విద్యా సంస్థ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న 50 నిరు పేద కుటుంబాలకు సుమారుగా రెండు వేల రూపాయల విలువైన నిత్యవసర వస్తువులు పంపిణీచేశామన్నారు. వర్డ్ అండ్ డీడ్ విద్యా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ లో మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది ఆనంద్, వనం చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు పాలడుగు నాగార్జున, ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.