Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలుస్తుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మా రావు గౌడ్ అన్నారు. గురువారం సీతాఫలమండీ డివిజన్లోని సుబాష్ చంద్రబోస్ నగర్లో 60, మెట్టుగూడ డివిజన్ దోభీ ఘాట్‌లో 207 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలను హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయినగర్‌లో 104, ఆజాద్ చంద్ర శేఖర్ నగర్లో 48 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. నిరంతరం ప్రజల సంక్షేమానికి పద్మారావు గౌడ్ పాటుపడుతున్నారని హోం మంత్రి అన్నారు. మేయర్ మాట్లాడుతూ పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యత కల్పించాలని ప్రజలకు సూచించారు. అర్హులైన నిరుపేదలకు అన్ని సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి, కంది శైలజ, టీఆర్ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, నాయకులు మోతే శోభన్ రెడ్డి, కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, కరాటే రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారుల కిషన్, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ మోహన్ రెడ్డి, వెంకట దాస్ రెడ్డి, ఆశాలత, నునీల్, వెంకట రమణ, జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.