Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్మాసిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి
- ఫార్మాసిస్ట్స్ని ఫార్మసీ ఆఫీసర్స్‌గా పేరు మార్చాలి
- గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ డిమాండ్
- డీహెచ్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఫార్మాసిస్టుల సమస్యలు పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని, ఫార్మాసిస్ట్స్ పేరును ఫార్మసీ ఆఫీసర్స్‌గా మార్చాలని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. డీహెచ్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర అధ్యక్షుడు రాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తిని సుదర్శన్గౌడ్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మసిస్ట్ గ్రేడ్2, గ్రేడ్1, సూపర్వైజర్స్లను ఫార్మసీ ఆఫీసర్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్, జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా మార్చడానికి సంబంధించిన ఫైల్ డీహెచ్ వద్ద రెండేండ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. వెంటనే ప్రభుత్వానికి పంపించాలని కోరామమన్నారు. ఫార్మాసిస్ట్స్ గ్రేడ్ 2ని జిల్లా క్యాడర్ నుండి జోనల్ క్యాడర్‌కి మార్చాలని కోరారు. ఈ ఔషధీ ప్రోగ్రాం కోసం అదనపు ఫార్మసిస్ట్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోల్డ్ చైన్/ఈవీన్ ప్రోగ్రాం జిల్లా స్థాయిలో ఎంపీహెచ్ఎస్ (ఎం) పని చేస్తున్నారని పేర్కొన్నారు. పీహెచ్సీలలో కూడా వారికే ఆర్డర్స్ ఇవ్వాలన్నారు. జనరల్ ట్రాన్స్ఫర్స్లో డీహెచ్ పరిధి నుంచి డీఎంఈకి, డీఎంఈ పరిధి నుంచి డీహెచ్‌కి వెళ్లడానికి ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. 2001 నుంచి పనిచేస్తున్న ఫార్మాసిస్ట్స్ అందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిస్ట్స్ 33 ఏండ్లపైబడి సర్వీస్ చేసినా ఎటువంటి ప్రమోషన్ లేకుండానే రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ఫార్మసిస్ట్‌కు అతని సర్వీస్‌లో కనీసం(4) ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. ఫార్మాసిస్ట్స్లకు సెపరేట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మసీ ఉద్యోగానికి కనీస విద్యార్హత బి.ఫార్మసీ ఉండాలన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్/డ్రగ్ అనలిస్ట్ పోస్ట్‌లకు ఇన్ సర్వీస్ కోట 40శాతం ఇవ్వాలని కోరారు. టీఎస్పీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన కాంట్రాక్టు ఫార్మాసిస్టులకు వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఫార్మసిస్ట్‌కు ప్రమోషన్ రానిచో అడ్హాక్ ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. అన్ని బస్తీ దవాఖానాల్లో ఫార్మాసిస్ట్స్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. హెల్త్ వెల్ నెస్ సెంటర్స్‌లలో ఫార్మాసిస్ట్స్లను వెంటనే నియమించాలన్నారు. జీవో 510 ప్రకారం ఎన్హెచ్ఎం స్కిమ్‌లో పనిచేస్తున్న ఆర్.బి.బిఎస్ కె. యుపిహెచ్సి, ఆయుష్ ఫార్మాసిస్ట్స్ ఉద్యోగులకు వేతనం రూ.21 వేలు మాత్రమే ఇస్తున్నారని వారికి11వ పీఆర్సీ ప్రకారం రూ.31,040 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 104 సర్వీస్‌లో పనిచేస్తున్న (అవుట్ సోర్సింగ్) ఫార్మాసిస్ట్స్లకు రూ.17,500 మాత్రమే ఇస్తున్నారని. సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం రూ.31,040 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాలలో కలెక్టర్లు ఫార్మాసిస్ట్స్ లను నియమించుకున్నారు. కలెక్టర్ ఫండ్స్ నుండి ప్రతి నెల రూ.1 వేలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రూ.21వేలు ఇస్తున్నారు. వీరికి కూడా సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ప్రకారం రూ. 31,040 వేలు ఇవ్వాలన్నారు. కొవిడ్‌తో చనిపోయిన రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంజుల గోపాల్‌ల సంతాప సభ డీహెచ్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
టీవీవీ స్వప్న,(కాంట్రాక్టు ఫార్మసిస్ట్) డీఎంహెచ్ఓ ఆసిఫాబాద్‌లో పనిచేస్తూ చనిపోయిందని ఆమె కుటుంబానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి రూ.లక్షా 30 వేల ఆర్థిక సాయం అన్న కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు రాగిరెడ్డి వీరారెడ్డి, బత్తిని సుదర్శన్ గౌడ్, వైద్య ఆరోగ్యసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి, డాక్టర్ కత్తి జనార్దన్, సుజాత రాథోడ్, ఎ.సుజాతగౌడ్, శిరీష రాణి, భరత్ సత్యనారాయణ, గవర్నమెంట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలువేరు ఉదరు ప్రసాద్, సెల్వరాని, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వంగ సుధాకర్ రెడ్డి, దేవాంభట్ల ప్రకాష్ రావు, వెంకట రమణ, రమాదేవి, సుజాత, శ్రీదేవి, మానుపాటి రాజేందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.