Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెంగిచెర్ల డిపో మేనేజర్ ఎన్.ఈసు
నవతెలంగాణ-బోడుప్పల్
మహిళలకు సురక్షితమైన బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్.ఈసు తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో గురువారం మాట్లాడుతూ మహిళల బస్ ప్రయాణ సౌకర్యార్థం రాత్రి 7.30 గంటల తర్వాత స్టేజీల మధ్యలో కూడా మహిళలు చెయ్యి ఎత్తితే బస్సు ఆపి ఎక్కించుకునేందుకు కోరిన చోట బస్సు దిగేందుకు వీలు కల్పిస్తూ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
వి.వెంకటేశ్వర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై బస్సు డ్రైవర్లు, కండక్టర్లు అందరికీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. మహిళలు అసౌకర్యానికి గురిఅయినట్లయితే వెంటనే తమకు ఫిర్యాదు చేసినచో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవటంతో పాటు పునరావతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మహిళలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆర్టీసీ బస్సులలో సురక్షితంగా ప్రయాణం చేయడంతోపాటు క్షేమంగా ఇంటికి చేయవచ్చని చెప్పారు. మహిళా ప్రయాణికుల పట్ల తమ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డిపో మేనేజర్ల నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఆర్టీసీ బస్సులను పూర్తిగా శానిటేషన్ చేసిన తర్వాతనే ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం ఆరోగ్యదాయకం, సురక్షితం, క్షేమదాయకమని చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి సంస్థ పురోభివద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ (మెకానిక్) దయాకర్ తదితరులు పాల్గొన్నారు.