Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలం దమ్మాయిగూడలో అభంశుభం తెలియని మూడు సంవత్స రాల చిన్నారిపై అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసిన కామాంధు లను కఠినంగా శిక్షించాలని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ డిమాండ్ చేశారు. కీసర మండలం దమ్మాయిగూడలోని వెంకటే శ్వరనగర్ కాలనీకి చెందిన మూడున్నర సంవత్సరాల చిన్నారి పాపను ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి సమీపంలోని సోషల్ ఫారెస్ట్‌లో అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసి సమీపంలోని ప్రగతి నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర వదిలేసి వెళ్లారు. తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న చిన్నారిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం వెంకటేశ్వర నగర్‌లోని బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలిక చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.25,000 అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికను అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దుండగులపై నిర్భయ, దిశ చట్టాల కింద కేసులు నమోదు చేయాలని వారు కోరారు. బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. బాలిక కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు పోలీసులపై, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాలిక ఇంటి వద్ద బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు విజరు కుమార్, అమర్నాథ్, అనిల్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బండే గౌడ, ప్రధాన సలహాదారులు యావపురం విశ్వనాథం, కాప్రా అధ్యక్షులు ఈశ్వరయ్య, నాయకులు జ్ఞానేశ్వర్, సిద్దేశ్వర్, శ్రీశైలం, యావపురం రవి పాల్గొన్నారు.
అర్హుందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయాలి
నవతెలంగాణ-గాంధీనగర్
గాంధీ నగర్ డివిజన్లోని అర్హులం దరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని గాంధీ నగర్ డివిజన్ కార్పరేటర్ ఎ.పావని వినరు కుమార్ హైదరాబాద్ సివిల్ సప్లై మరియు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అర్.టుక్యా నాయక్, సర్కిల్ 6 అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్‌ను కలిసి వినతపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ పావని వినరు కుమార్ మాట్లాడుతూ గాంధీ నగర్లో చాలా మంది అర్హతలు కల్గి ఉన్నా తమకు ప్రభుత్వపరంగా పేదల సంక్షేమం కోసం ఉన్న రేషన్ కార్డులు ఇవ్వకుండా పొట్ట కొడుతున్నారని, పేదలు కార్పొరేటర్‌కు వారి సమస్యను చెప్పుకున్నట్లు తెలిసింది. రేషన్ కార్డులకు అర్హత కల్గిన వారు ఎవరైనా తమను కార్పొరేటర్ క్యాంప్ కార్యాలయంలో సంప్రదించండి అని లేదా 7799819991 అనే నంబర్‌కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. ఈ కర్య క్రమంలో బీజేపీ నగర సీనియర్ నాయకులు ఎ.వినరు కుమార్, కె.హరి కష్ణ, అసెంబ్లీ కోకన్వీనర్ ఆనంద్ రావు, నవీన్ కుమార్, ప్రశాంత్, హై కోర్ట్ అడ్వకేట్ కడారి రమేశ్ తది తరులు పాల్గొన్నారు.