Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
కేంద్ర రక్షణ శాణ 2021 క్లాజ్ పేరిట జారీచేసిన నోటిఫికేషన్‌లోని వివిధ అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. న్యూ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లో 'సేవ్ కంటోన్మెంట్ సిటిజెన్ రైట్స్ పేరిట నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 సీ.ఎల్.ఏ. ఆర్లలో సివిల్, బజార్ ప్రాంతాలతో పాటు బి3 బంగ్లాలు, స్థలాలకు సంబంధించిన వివిధ అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని స్థలాలు, ఇండ్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని కోరారు. 2021 సీ.ఎల్.ఏ.ఆర్‌పై అభ్యంతరాలు, సూచనలను చేయడానికిగాను అధికారులు ఈ నెల 28వ తేదీవరకు గడువును ఇచ్చార తెలిపారు. గడువులోపు పౌరులు తమ అభ్యంతరాలను వ్యక్త పరచకపోతే ఆయా ప్రాంతాలకు చెందిన సామాన్య పౌరులు తమ స్థలాలు, ఇళ్లపై ఉన్న యాజమాన్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సివిల్, బజార్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జరిగి వాటి వివరాలను ధరణి పోర్టల్‌లో పొందుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని ఇటీవలే బోర్డు కార్యాలయాన్ని సందర్శించిన డీజీడీఈ ప్రచుర్ గోయల్‌ను కోరినట్లు తెలిపారు. ఇదే విషయమై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు లోకనాథం, నళినీ వెంకట్రావు, ప్రభాకర్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు