Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ కొత్త పేట్ చౌరస్తాలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దిష్టి బొమ్మ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం దహనం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బి ఫారంతో ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రా రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు మధు యాష్కి గౌడ్ దిష్టి బొమ్మను దహనం చేశారు కూడా. దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ బండి మధుసూదన్ రావు అధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ మహేశ్వరం నియోజకవర్గం నాయకులు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సబితా ఇంద్రా రెడ్డి అనుచరులు మధు యాష్కీ గౌడ్ దిష్టి బొమ్మను దహనం చేయడ సిగ్గుమాలిన చర్యగా వర్ణించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, నల్లేంకి ధనరాజ్ గౌడ్, గట్ల రవీంద్ర, తలాటి రమేష్ నేత, శేఖర్ ముదిరాజ్, ఎన్ఎస్యూఐ శివ, బొడ్డుపల్లి మహేందర్, రాజు నాయక్, అల్లేటి కిరణ్ కుమార్, ప్రేమ్ నాయిక్, అక్బర్, రంజిత్, సత్తి, శ్రీకాంత్, సంతోష్, కల్యాణ్, అక్రమ్, సిరిసి, జహంగీర్, రవి నాయక్, పాండు నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.