Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సూచనతో యువనేత దొడ్ల రామకష్ణగౌడ్ పట్టణ ప్రగతిలో భాగంగా, వెంకట పాపయ్యనగర్, ఉజ్జయిని మహంకాళినగర్లలో జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా చెత్తా చెదారం తొలగింపజేశారు. ఎంటమాలజీ సిబ్బంది, నాయకులతో కలిసి కాలోనీలలో పర్యటించారు. అనవసరంగా నిలువ ఉన్న నీటిని తొలగించారు. నిలువవల్ల దోమలు పెరిగి రోగాలకు కారణం అవుతాయి కాబట్టి ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలువకుండా చూసుకోవాలని అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అవగాహన కల్పించే స్టిక్కర్స్ కాలనీలో అంటించారు. కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి చిన్నోళ్ల శ్రీనివాస్, జనార్దన్రావు, చాగంటిఅశోక్, జీవన్ రెడ్డి, అగ్రవాసు, యాదగిరి, వెంకటేష్, రాము, నారాయణ, నర్సింహులు, ఈశ్వర్, కటిక రవి, దేవేందర్, శంకర్, కష్ణగౌడ్, మాణిక్యం, వెంకటస్వామిగౌడ్, సైదులు, సత్యం, మల్లయ్య ఎంటమాలజీ సూపర్ వైజర్ నర్సింహ, ఎస్ఎఫ్ఏలు వీరారెడ్డి, శివకుమార్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.