Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-అడిక్‌మెట్
అన్ని సౌకర్యాలతో, అన్ని హంగులతో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని హోం మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్లోని సాయిచరణ్ కాలనీ, భోలక్‌పూర్ డివిజన్లోని టి.అంజయ్య నగర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత లతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు లాటరీ సిస్టం ద్వారా ఇండ్లను కేటాయించి పట్టాలు, తాళాలు అందజేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఒక్కోదానిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో ముషీరాబాద్ నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో వసంతకుమారి, ఎమ్మార్వో జానకి, స్థానిక కార్పొరేటర్లు సునీత ప్రకాష్ గౌడ్, గౌస్ఉద్దీన్, నగర నాయకులు ఎంఎన్ శ్రీనివాస రావు, యువ నాయకులు ముఠా జైసింహ, లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మెన్ ముచ్చకుర్తి ప్రభాకర్, సీనియర్ నాయకులు బింగి నవీన్, మాధవ్, ఖదీర్, నేత శ్రీను, బోలక్ పూర్ డివిజన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.