Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం సూర్యాపేట - దంతాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కందాల కృష్ణారెడ్డి, కూసు బాలకృష్ణ, యల్లవుల నరేష్, బాణాల వెంకట్‌రెడ్డి, వెంకన్న, జటంగి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట - జనగామ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ పెంచిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఒడ్డు శంకర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వి.శ్రీనివాస్, సీపీఐ(ఎం) నాగారం మండల కార్యదర్శి కడియం కుమార్, వెంకన్న, శివ, వెంకన్న, ఉర్దూ సైదులు, నిమ్మలకూడి అబ్బులు, బొడ్డు కిష్టయ్య, సంపెట కృష్ణమూర్తి, సంపెట కాషయ్య, భయ లింగయ్య, యానాల సుధాకర్‌రెడ్డి, సోమయ్య, బొడ్డు కిష్టయ్య తదిరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్:పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల ధరలూ విపరీతంగా పెరిగి పోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసు, శేషయ్య, బాబు, కొండయ్య పాల్గొన్నారు.