Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని జనంపల్లి గ్రామంలో చెరువు, కుంటల శిఖం, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గ్రామ సర్పంచ్ లేక యాదయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం అధికారులు సర్వే నిర్వహించారు. గ్రామానికి తూర్పు భాగంలో ఉన్న అయ్యన్న చెరువు దాదాపు 42 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, దీనిలో దాదాపుగా 20 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్టు అధికారులు గుర్తించారు. కంప చెట్లను తొలగించి, సరిహద్దులు నిర్ణయించి, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువును అభివద్ధి పనులను చేయిస్తామనిఅధికారులు తెలిపారు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి గ్రామపంచాయతీకి అప్పగిస్తే మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామని సర్పంచ్ రేఖ యాదయ్య యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నగేష్ కుమార్, సర్వేయర్ వనజ, సింగిల్ విండో డైరెక్టర్ నక్క యాదయ్య, ఉప సర్పంచ్ నడిగోటి అనిత సైదులు, ఐదవ వార్డు సభ్యుడు పండుగ నరసింహ, వీఆర్ఓ నరసింహ, వీఆర్ఏలు ఎండి.బాబు, పూజారి మచ్చ గిరి, మెడబోయినకష్ణ ,వరికుప్పల మైసయ్య పాల్గొన్నారు.