Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. శుక్రవారం గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్‌నగర్ గ్రౌండ్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా గౌతమ్‌నగర్ కార్పొరేటర్ మేకల సునితా రాముయాదవ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మల్లికార్జున్ నగర్లో రూ.50 లక్షలతో ఆర్సీసీ పైపులైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భ ంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగం గా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. పట్ట ణ ప్రగతి కార్యక్రమం వల్ల నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో సమస్యలు పరిష్కారంకావడంతో పాటు పరిశుభ్రంగా మారుతున్నాయనీ, ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి డివిజన్లో స్థానికులు తెలిపిన సమస్యలను వేగవం తంగా పరిష్కరించాలని సూచించారు. డ్రయినేజీ, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను త్వరగా పరి ష్కరిస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధికి మొదట ప్రాధాన్యత ఇస్తానన్నా రు. కార్యక్రమంలో డీసీ దశరథ్, ఈఈ లక్ష్మణ్, ఏసీపీ గజానంద్, డీఈ లౌక్య, ఏఈ దీపక్, శానిటేషన్, మలేరియా, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, మల్లికార్జున్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స భ్యులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులుపాల్గొన్నారు.