Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జీవానోపాధి కోసం జోలె పడుతున్నాడు..
- సంస్కృతిక సారిధిలో ఉద్యోగం ఇస్తామని మోసం చేశారు..
- ఓ పేద కళాకారుని కుటంబం ఆవేదన
నవతెలంగాణ-బోడుప్పల్
తాను నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ వైదిక ఎక్కి మైకు చేతిలో పట్టుకుని గొంతెత్తినా వేలాది మంది ప్రజలు చెవులు పెట్టి వినేటోళ్ళు. కానీ నేడు అదే వ్యక్తి జీవానోపాధి కోసం జోలె పట్టి యాచిస్తున్నాడు. వివారాల్లోకి వెళ్తే.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పాట (పెద్దొల్ల) మహేష్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి కేసీఆర్ సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా హాజరై పాటపాడుతుండే వాడు. అలా తనకు ఉద్యమంలో పరిచయమైన రాజశ్రీని 2006లో వివాహం చేసుకున్నా డు. వారికి పుట్టిన పాప నిపుణశ్రీ కూడా కళకారిణే అయి తే తెలంగాణ ఉద్యమంలో చివరి వరకూ ఉండి అనేక పాటలు పాడిన వీరికి నేడు కళాకారుల కోసం ఏర్పాటు చేసిన సంస్కృతిక సారిధిలో ఉద్యోగం వస్తుందనే అశతో దరఖాస్తు చేసుకుంటే నిరాశే ఎదురైంది. సంస్కృతిక సారిధిలో ఉన్న 550 మంది కళకారుల్లో అనేక మంది అనర్హులు ఉన్నా తమలాంటి అర్హులైన వారికి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినా తమ కుటు ంబం ఆర్థికంగా బాగేండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలనీ, ఈ విషయంపై రాష్ట్ర సంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టి సారించాలని కోరారు.
పేద కళకారులను అదుకోవాలి
తెలంగాణ ఉద్యమం కోసం పని చేసిన కళాకా రులను ప్రభుత్వం తరుపున ఆదుకుని న్యాయం చేయా లని కురుమ యువ చైనత్యం సమితి రాష్ట్ర అధ్యక్షులు చిర్ర చందు డిమాండ్ చేశారు. శుక్రవారం మేడిపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో కళకారుడు మహేష్, రాజశ్రీ, నిపుణశ్రీతో కలిసి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన కళా కారులను ప్రభుత్వం ఆర్ధికంగా అదుకునేందుకు ఏర్పాటు చేసిన సంస్కృతిక సారధిలో నిజమైన కళకారులకు న్యాయం జరగడం లేదన్నారు. ఇప్పటికైనా మహేష్ కుటుంబాన్ని ఆదుకుని ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర నాయకులు గొరిగె నర్సింహ్మ, రాజుకుమర్, రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.