Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం తో పాల్గొని మొక్కలు నాటి వాటిని రక్షించాల్సిన భాద్యత మనందరిపై ఉందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేష న్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. శుక్రవారం నాదర్గుల్, కూర్మల్‌గూడ, మామిడిపల్లిలోని 19, 27, 9,10,11,12వ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడంతోపాటు హరితహారంలో భాగంగా అయా కార్పొరేటర్లతో కలసి పలు కాలనీల్లో మొక్కలు నాటారు. అనంతరం కార్పొరేటర్లు, నాయ కులు, కాలనీ వాసులతో కలిసి డివిజన్లలో పర్యటించి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీల అధ్యక్షులు, ప్రజలతో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడు తూ పట్టణ ప్రగతి కార్యక్రమానికి రాష్ట్రం రూ.కోట్లు కేటాయించిందని తెలిపారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. కార్పొరేటర్లు అన్ని డివిజన్లలోని వార్డు కమిటీలను పటిష్టం చేయాలన్నారు. మొక్కలను నాటి వాటిని పెంచడమే కాకుండా వాటి సంరక్షణ చేసే బాధ్య తను ప్రతి పౌరుడూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్‌రెడ్డి, డీఈఈ అశోక్‌రెడ్డి, కార్పొరే టర్లు రామోజు అమితా శ్రీశైలంచారి, నిమ్మల సునితా శ్రీకాంత్‌గౌడ్, తోట శ్రీధర్‌రెడ్డి, గూడెపు ఇంద్రసేన, రోహి ణి రమేష్ ముదిరాజ్, సుక్క శివకుమార్, యాతం పవన్ కుమార్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యుడు మర్రి జగన్ మోహన్‌రెడ్డి, ఏఈఈలు బిక్కు నాయక్, రాంప్రసాద్‌రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శాని టేషన్ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు.