Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బుర్ర రేఖామహేందర్
- బండరావిరాలలో హరితహారం
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
హరితహారం అందరి బాధ్యతగా గుర్తించాలని ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బండ రావిరాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పల్లె ప్రగ తి తొమ్మిదో రోజున బండరావి రాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటి, ఇక్కడి నర్సరీలో ఉన్న మొక్కలను పరిశీలిం చినట్టు తెలిపారు. మండలంలో నాటిన ప్రతి మొక్క నూ పెంచడం బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బింగి దాస్ గౌడ్, ఎంపీడీఓ దేవేందర్‌రెడ్డి, ప్రత్యేక అధికారులు పద్మావతి, రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు చెరుకు కిరణ్ కుమార్, కావాడి శ్రీనివాస్‌రెడ్డి, సురకంటి వనజ శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీటీసీలు తాటిపల్లి సౌమ్య రమేష్ గౌడ్, దంతూరి అనిత మహేందర్‌గౌడ్, ఉప సర్పంచ్‌లు చెరుకు కావ్య శివశంకర్, స్వామి, వివిధ గ్రామాల వార్డు సభ్యులు, కార్యదర్శిలు, కో-ఆప్షన్ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.