Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
మున్సిపాల్టీల్లోని అన్ని వార్డుల్లో ఉన్న కాలనీలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అన్ని వర్గాలకు చెం దిన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జల్పల్లి మున్సిపల్ రిప్రజెంటెటివ్ వైస్ చైర్మన్ యూసూప్ పటేల్ అన్నారు. శుక్రవారం మున్సిపల్లోని 8వ, 21వ వార్డుల్లోని పలు కాలనీలో పటణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జేసీ బీతో పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు కాలనీ ల్లోని రోడ్లుల్లోపై ఉన్న గుంతలను పూడ్చి వేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం పటణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్టలాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని రక్షించాల్సిన భాద్యత ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలపై ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో మున్సిపాల్టీ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని తెలిపారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు ఎంతో ఉపయోగపడుతాయనీ, హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వా ములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ షేక్ పమీద అప్జల్, కాలనీ అధ్యక్షులు హుసేన్, తదితరులు పాల్గొన్నారు.