Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ అధికారులతో కలిసి శుక్రవారం మదురానగర్ శ్రీనివాసపురం నవరంగ్ గూడ కామాక్షిపురంలో పర్య టించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డ్రయినేజీ సమస్యను పరిశీలించి పరిష్కరించాలాని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్య రాకుండా చూడాలన్నా రు. రోడ్ల పక్కన ఉన్న మట్టికుప్పలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కీర్తి, డీఈ నాగమణి, వాటర్ వర్క్స్ అధికారులు సత్యనారాయణ, విద్యుత్ అధికారి కటారి యా, వర్క్ ఇన్స్పెక్టర్ రాము, మదురానగర్ అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, శ్రీనివాసరావు, రవిందర్, మూర్తి, సత్యనా రాయణ, నాంచారి, వెంకటయ్య, అబ్బు కైసర్ సలీం పాష రవి, నారాయణ దాసు, లింగం, బీజేపీ నాయ కులు జిల్లా శ్రీనివాస్, రంగమ్మ, ప్రధాన కార్యదర్శి చెల్లో జు ఎల్లాచారి, దారం వెంకటేష్ గుప్త, హరిబాబు, పాశం ప్రవీణ్, ముశిగంపల శివగౌడ్, తదితరులు పాల్గొన్నారు.