Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
పట్టణ ప్రగతితో బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి, సంక్షే మం జరుగుతుందని కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని సాయినగర్ లో శుక్రవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బాలానగర్ డివిజన్ పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల ఎక్కువ శాతం పరిశ్రమలు ఉండటంతో ప్రతి ఒక్క రూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకుంటే కాలుష్యా న్ని నివారించగలమన్నారు. మానవ మనుగడకు మొక్కలు ప్రాణ వాయువనీ, ఆహ్లాదకర వాతావరణంలో మెరుగైన ఆరోగ్యకర జీవనం సాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ సూపర్వైజర్ ప్రియాంక, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మందడి సుధాకర్‌రెడ్డి, నాయకులు సోమిరెడ్డి, శ్రీనివాసరాజు, సాయినగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వి.యాదగిరిరెడ్డి, సభ్యు లు గన్ను తిరుపతయ్య, బి. సుధాకర్‌రెడ్డి, డీ.గోపాల్‌రెడ్డి, ఎన్. మంగపతి రావు, టి.దామోదర్ రెడ్డి, సీహెచ్. వెంకటయ్య, పి.పాపయ్య, ఏ.సత్యనారాయణ, వి.నాగేశ్వ ర్ రావు, బి.చంద్రకాంత్ రావు, నర్రా దేవేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.