Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే స్పందించిన విద్యుత్, పోలీస్ అధికారులు
నవతెలంగాణ-జవహర్‌నగర్
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి హైటెన్షన్ స్తంభం ఎక్కిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శివనాగప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూర్‌లో నివాసముంటున్న మహ్మద్ కతాల్ కొంత కాలంగా కుటుంబం కలహాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం ఉదయం కౌకూర్‌లోని 11కెవి 33 విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్‌ను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కిందకు దిగిరావాలని కోరినా కతాల్ దిగలేదు. దాంతో కతాల్ కూతురును తీసుకుచ్చిన పోలీసులు ఆమెను చూపించి కిందకురావాలని కోరారు. కూతురు పిలవడంతో కతాల్ కిందకు దిగాడు. దాంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత కతాల్కు పోలీసులు కౌన్సిలింగ్ అందించారు.