Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట్
దిల్సుఖ్నగర్లోని ఎవరెస్ట్ ఇంపాక్ట్ శిక్షణ సంస్థల డైరెక్టర్, గణిత అధ్యాపకులు బిశెట్టి రాజ్ కుమార్ గణితంలో అయిలర్ సంఖ్యలో గల మొదటి 5005 అంకెలను కండ్లకు గంతలు కట్టుకొని, ఒక గంట వ్యవధిలో ఒక్క తప్పు లేకుండా చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. శుక్రవారం రాజ్ కుమార్ను ఎవరెస్ట్ శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఈ రికార్డు 4556 ఉందని, ఇప్పుడు 5005తో రికార్డు నెలకొల్పానని తెలిపారు. తనకు చిన్నపటి నుంచి గణితమంటే ఎంతో మక్కువ అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే రికార్డును సొంతం చేసుకోగలిగానన్నారు. విద్యార్థులు కష్టంగా భావించకుండా ఇష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.కార్యక్రమంలో ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి, ఎవరెస్ట్ ఇంపాక్ట్ కోర్స్ డైరెక్టర్ సుపారస్ చాంద్ జైన్, సంస్థ డైరెక్టర్లు లక్ష్మి, తనూజ తదితరులు పాల్గొన్నారు.