Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు
- బాధితుల ఆవేదన
నవతెలంగాణ-బోడుప్పల్
తమ జాగాలో తమ పక్కన ఉన్న మరో జాగా సర్వే నెంబర్లతో ఇతరులు పర్మిషన్‌లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మేడిపల్లి మండల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు చెట్టిపల్లి జయమ్మ, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచెర్ల రెవిన్యూ సర్వే నెంబర్ 3 పార్టులో ప్లాట్ నెంబర్ 23,24,25,26లలో సూమారు 840 గజాల స్థలాన్ని 2000 సంవత్సరంలో కోనుగోలు చేశామన్నారు. అయితే తమ స్థలంలో 2013 నుండి పక్క సర్వే నెంబర్‌కు చెందిన వ్యక్తులు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సదరు వివాదం కోర్టు పరిధిలో ఉండగానే సదరు వ్యక్తులు 2016 నుండి పాత గ్రామాపంచాయతీ అనుమతులతో నిరార్మాణాలను చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై బోడుప్పల్ నగర పాలక సంస్థలో ఫిర్యాదు చేశామని చెప్పారు. అయినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అయితే ఎటువంటి అనుమతులూ లేకుండానే రాత్రికి రాత్రే చేపడుతున్న నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కార్పొరేషన్ అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలలని, లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.
చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం
చెంగిచెర్ల నుంచి చర్లపల్లి వెళ్లే మార్గంలో చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు పూర్తిస్థాయిలో విఫలం అయ్యారని బాధితులు ఆరోపించారు. ప్రలోభాలకు గురై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కమిషనర్, మేయర్, స్థానిక అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.