Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రగతి ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలి
- బోడుప్పల్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ నగర పాలక సంస్థను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిలతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బోడుప్పల్ ను ప్లాన్ ప్రకారం డెవలప్చేసేందుకు పాలకవర్గం అంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. బోడుప్పల్ రా చెరువు నుంచి సుద్ధకుంట నాలా వరకు రూ.1.30 కోట్లతో స్లాబ్ వేస్తున్నామని అన్నారు. అదే విధంగా రూ.90 కోట్లతో స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ద్వారా చెరువులను అనుసంధానం చేసేలా ప్రణాళిలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతీ ఇంటి అవరణలో మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా బోడుప్పల్లో సమీకృత మార్కెట్ నిర్మాణంకోసం త్వరలోనే ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. అనంతరం శాసన మండలి సభ్యురాలు వాణిదేవి మాట్లాడుతూ.. మానవాళి మనుగడకు చెట్లే ప్రాణాధారమని అన్నారు. అందుకే అందరం మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమానికి స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించాగా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యామ్సన్, నగర కమిషనర్ ఎం.శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, తహసీల్దార్ ఎస్తేర్ అనిత, కార్పోరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్ యాదవ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, కాటపల్లి రాంచంద్రారెడ్డి, కొత్త శ్రీవిద్య, మోదుగు శేఖర్ రెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్, జె.మహేందర్ యాదవ్, చీరాల నర్సింహ్మ, సుమన్ నాయక్, డీ.మహేశ్వరి, సుగుణల, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.