Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఘట్కేసర్/ఘట్కేసర్ రూరల్
పల్లెప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాలు అభివృద్ది పథంలో ముందుకు పోతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సిం గారంలో సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి ఆధ్వ ర్యంలో గ్రామ సరిహద్దులో స్వాగత తోరణం, సీసీ రోడ్డు, డ్వాక్రా భవనం, కమ్యూనిటీ భవనం, ముత్వెల్లిగూడ శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, కురుమ సంఘం ఆధ్వర్యంలో మహేశ్వరీ కాల నీలో బీరప్పగుడి ప్రహారిగోడ నిర్మాణానికి, పలు అబివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థా పన చేసి ప్రారంభించారు. చౌదర్‌గూడ గ్రామం లో 4వ విడతపల్లె ప్రగతిలో భాగంగా నిర్వహిం చిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు ఎంతో అభివృద్ది చెందాయన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా తీసుకోవడ ంతో నేడు రాష్ట్రంలో అడవులు పెరుగుతున్నాయ న్నారు. ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా తెలం గాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడు తోందన్నారు. సంక్షేమ పథకాల్లో దేశంలోనే ఆద ర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యామ్సన్, జెడ్పీ సీఈవో దేవసహాయం, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, స్పెషల్ ఆపీసర్ సత్తార్, ఎంపీడీవో అరుణ, ఇన్చార్జీ ఎంపీవో కు మార్, ఏపీఎం పరిమిళ, ఎంపీటీసీ మలిపెద్ది వెంకట్ రాంరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, వార్డు సభ్యులు మట్ట విష్ణుగౌడ్, పెరుమాండ్ల సుదర్శ న్, రాయబండి నవీన్, బండిరాల శ్యామ్, కిన్నెర లక్ష్మీ శ్రీ, నల్ల అరుణ, నల్ల రజిత, మట్ట లలిత, అంబటి సంధ్య, రాజగోని మహేష్ కుమార్, చెట్టిపల్లి గీత, ఓరుగంటి సరళ, కో-ఆప్షన్ సభ్యులు మోటకట్ల భద్రారెడ్డి, వర్కాల అంజనే యులు, మాజీ ఎంపీటీసీ నాగులపల్లి రమేష్, బోడిగె ఐలయ్య, బొడిగె కృష్ణ, భస్వరాజ్గౌడ్ తది తరులు పాల్గొన్నారు. మండలంలోని ఛౌదర్ గూడ గ్రామంలో 4వ విడతపల్లె ప్రగతిలో భాగ ంగా నిర్వహించిన గ్రామసభలో కూడా మంత్రి పాల్గొన్నారు. ఈ సభకు సర్పంచ్ బైరు రమా దేవి రాములుగౌడ్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్‌శామ్‌సన్, సీఈవో దేవసహాయం, మండల ప్రత్యేక అధికారి యం.ఎ.సత్తర్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో అరుణరెడ్డి, పంచాయతీ ప్రత్యేక అధి కారి వై.శారద, ఉపసర్పంచ్ కుర్ర మహేందర్, వార్డు సభ్యులు పశలాది లావణ్య, మంచాల సుధాకర్, మంద స్వామిదాస్, బండ్లగూడం వాణి, కొంగరి శంకర్‌గౌడ్, పులకంటి సంయుక్త భైరు లక్ష్మణ్‌గౌడ్, రాడమల్ల బోజిరెడ్డి, భిలకంటి స్వాతిరెడ్డి, పాలడుగు అరుంధతి, ఎంపీటీసీ సభ్యులు నీరుడి రామారావు, పులకంటి భాస్కర్ రెడ్డి, కో-అప్షన్ సభ్యుడు వెంకటేష్ మంజుల, గ్రామకార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి ఎదుట నిరసనలు
కాచవాని సింగారంలో, చౌదర్‌గూడ గ్రా మాల్లో పర్యటించిన మంత్రికి నిరసనలు ఎదుర య్యాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 1లోని ప్లాట్ల బాధితులు తమకు న్యాయం చేయాలని ప్లకారు ్డలు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. కొందరు రియల్ వ్యాపారులు, అధికార పార్టీకి చెందిన వారు ముత్వెల్లి గూడలో సర్వే నెంబర్ 1లోని ప్లాట్లను కబ్జా చేశారని, స్థానిక ప్రజా ప్రతినిధులు రియల్ వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నారని రాజేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్లాట్ల బా ధితులతో కలసి మంత్రికి వినతి పత్రం అంద జేశారు. చౌదర్‌గూడలో అభివృద్ధి పనులు ప్రార ంభించడానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిని సమా వేశంలో ఎంపీటీసీ పులకంటి భాస్కర్‌రెడ్డి గ్రామ స్తులు సమస్యలపై నిలదీశారు. చౌదర్‌గూడలో కరోనాతో దాదాపు 15 మంది చనిపో యారనీ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయా లని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు.