Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
రాష్ట్ర ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బో నాల పండుగ ఆదివారం ప్రారంభం కానుంది. నెల రోజు ల పాటు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అమావాస్య త ర్వాత వచ్చే మొదటి గురువారం కానీ మొదటి ఆదివారం కానీ ప్రారంభమవుతాయి. ఈ ఆషాడంలో అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం కావడంతో రేపు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నా యి. చారిత్రక గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంబికా ఆలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్త ంగా బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. గోల్కొ ండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి బోనాలు ఉంటాయి. ఆషాడ మాసం చివరి రోజున తిరిగి జగదాంబిక ఆలయంలో చివరి బోనం పూజతో ఉత్సవాలు ముగుస్తాయి. జగదాంబిక ఆలయంలో మొదటి బోనం సమర్పించే ఆనవాయితీ కులీ కుతుబ్ షాహి కాలం నుంచి వస్తుంది. గతేడాది కరోనా నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించలేకపోవ డంతో ఈ సారి ఘనంగా నిర్వహించాలని జగదాంబికా ఆలయ ట్రస్ట్ బోర్డ్ నడుం బిగించింది. నెల రోజులపాటు ప్రతి గురు, ఆదివారం అంగరంగ వైభవంగా బోనాల పం డుగ జరుగనుంది. ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వ హిస్తారు. ప్రభుత్వం గోల్కొండ బోనాల ఉత్సవాలకు రూ.10 లక్షల నిదులు మంజూరు చేయడంతో జగదాంబి కా ఆలయ ట్రస్టు చైర్మన్ గోవిందరాజు, ఆలయ కార్యనిర్వ హణాధికారి మహేందర్ కుమార్, ప్రభుత్వ అధికారులు ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు నగరం నుంచే కాకుండా మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.
గోల్కొండ బోనాల షెడ్యూల్
జూలై 11 మొదటి పూజ
జూలై 15 రెండో పూజ
జూలై 18 మూడో పూజ
జూలై 22 నాలుగో పూజ
జూలై 25 ఐదో పూజ
జూలై 29 ఆరో పూజ
ఆగస్టు 1 ఏడో పూజ
ఆగస్టు 5 ఎనిమిదో పూజ
ఆగస్టు 8 తొమ్మిదో పూజ