Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
- అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ-అంబర్‌పేట
సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం గోల్నాక డివిజన్ పరిధిలోని కృష్ణానగర్‌లో నిర్వ హించిన మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రాబోయే కాలంలో చేప ట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చిం చారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కృష్ణానగర్‌లో మూసి పరి వాహన ప్రాంతంలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఖాళీ స్థలంలో ఉన్న చెత్త, చెదరాలను, మట్టి కుప్ప లను వెంటనే తొలగించాలని అధికారులకు సూచిం చారు. బోనాల పండుగ నేపథ్యంలో అమ్మవారి ఆల యానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లు, నీటి సరఫరా ఉండే విధంగా చూడటం, ఆల యానికి పెయింటింగ్ వేయించడం వంటి అంశాల గురిం చి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధుల పైన రిటర్నింగ్ వాల్ పైన దృష్టి సారించాలనీ, మూసీ పరివాహక ప్రాంతాల సుందరీకరణపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసిందనీ, త్వరలోనే వాటిని అమలు చేసే విధంగా అధి కారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ వేణుగోపాల్, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, వాటర్ వర్క్స్ డీజీఎం సన్యాసిరావు, ఏఈలు శేఖర్, గురునాథ్, ఎల క్ట్రికల్ డీఈ రమణారెడ్డి, జ్యోతి బాయి, నాయకులు భరత్ రాజ్, లక్ష్మణ్, ఆర్కేబాబు, రాము, కొమ్ము శ్రీనివాస్, లింగంగౌడ్, కాలేరు రాము, రాజు, బుచ్చిరెడ్డి, శ్రీను, ప్రభాకర్, ధర్మేంధర్, చారి, సురేష్, సతీష్, ఉమా, ధనలక్ష్మీ, దివ్య, పల్లవి, లక్ష్మీ, బస్తీవాసులు బాలరాజు, శ్రీకాంత్, నరేష్, మోహన్, చంద్ర, శ్రీధర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.