Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివారం ఘట్టాల ఊరేగింపు
- మహంకాళి ఆలయ ఈవో మనోహర్‌రెడ్డి
నవతెలంగాణ-బేగంపేట
అత్యంత వైభవంగా నిర్వహించే ఉజ్జయిని మహంకా ళి అమ్మవారి జాతర ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని మహంకాళి ఆలయ ఈవో మనోహర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేం దుకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తు న్నామని తెలిపారు. 11వ తేద ఘటం ఊరేగింపునకు మంత్రి తలసాని చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఘటం అన్ని వీధులు తిరుగుతుం దనీ, ఇండ్లలో ఘట్టాన్ని దించే వీలు లేదనీ, ఈ విషయాన్ని భక్తులందరూ గమనించాలని వెల్లడించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా బోనాలకు 2 క్యూ లైన్లతో పాటు మొత్తం 6 క్యూ లైన్లు ఉంటాయనీ, ఏటా దాదాపు 30 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం రావచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆలయానికి రాలేని వాళ్ళు రూ.150 ఆన్లైన్ చెల్లించితే వారి పేరిట సత్సాంగ్ సభ్యులచే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తామనీ, అలాగే వారి ఇంటికే ప్రసాదాన్ని( డ్రై ఫ్రూట్స్) పంపిస్తామని ఆయన పేర్కొన్నారు ఆలయ పరిసరాల్లో దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఘటోత్సవల ప్రారంభమైన రోజు నుంచి ఆషాడ మాసం ముగిసే వరకు అమ్మవారికి బోనాలు సమర్పించుకోవచ్చు భక్తులకు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మకర్త మండలి సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం జాతర కోసం పూర్తి సహకారాన్ని అందిస్తామని వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ కామే ష్, కమిటీ సభ్యులు మహేష్ యాదవ్, ఆనంద్ పటేల్, మహేందర్, శ్రీనివాస్‌గౌడ్, రామకృష్ణ, కెఎం.కృష్ణ, పిల్లి ప్రకాష్, కిషోర్ కుమార్, కస్తూరి, విశ్వనాథన్, చంద్ర ప్రకా ష్ రాజేందర్, కూర శ్రీనివాస్, రామతీర్థ శర్మ పాల్గొన్నారు.