Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిగించిన స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహ
నవతెలంగాణ-నారాయణగూడ
కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తున్నామని కొడుకు కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం, ఉన్న ఉద్యోగాలు ఊడకొడుతూ తండ్రి కేసీఆర్ ప్రజల బతుకులను బజారుకీడుస్తున్నారని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సులను అకారణంగా విధుల్లో నుంచి తొలగించడం సరికాదని తెలిపారు. ప్రజాసేవతో పాటు జీవనాధారం కోసం చాలా మంది స్టాఫ్ నర్సులుగా చేరారనీ, కోవిడ్ కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ముందుండి ప్రా ణాలకు తెగించి వారి కుటుంబాలను వదిలిపెట్టి కరోనా బాధితులకు స్టాఫ్ నర్సులు చికిత్స అందించారని తెలి పారు. కొంత మంది నర్సులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి మృతి చెందారనీ, కరోనా యుద్ధంలో సైన్యంలా పోరాడిన స్టాఫ్ నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించడం సిగ్గుచేటనీ, గాంధీ ఆస్పత్రిని సందర్శించినప్పుడు సీఎం కేసీఆర్ స్టాఫ్ నర్సులతో మాట్లాడు తూ ఆరోగ్య రక్షణలో నర్సులు అం దించిన సేవలు, కృషిని అభినంది స్తూ వారందరి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీనిచ్చి ఇప్పుడు తీసేయడం ఏంటని ప్రశ్నించారు. ఉస్మానియా, గాంధీ, కోఠి మెటర్ని టీ, కోఠి ఈఎన్టీ, నిలోఫర్ ఆస్పత్రుల్లో వేలాది మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులుగా పని చేస్తున్నారనీ, ఆక స్మికంగా వారిని తొలగించడం చూస్తూ ఉంటే ప్రభు త్వాస్పత్రులను బలహీన పరచి ప్రైవేటీకరించడానికి సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నాడనడానికి సందేహమే మీ లేదని తెలిపారు. తొలగించిన స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకుని, రెగ్యులరైజ్ చేసి, జీతం బకాయిలు చెల్లించి, ప్రభుత్వాస్పత్రులకు తగినన్ని నిధులు విడుదల, అత్యాధునిక వసతులతో బలోపేతం చేసి ప్రతి సామాన్యునికీ మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చి స్టాఫ్ నర్సుల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోనళలు నిర్వహిస్తామని హెచ్చరించారు.